కాప్రా ప్రెస్ క్లబ్(ప్రింట్ మీడియా)నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సర్కిల్ పరిధిలోని ప్రింట్ మీడియా జర్నలిస్టులు శనివారం చర్లపల్లి లోని శ్రీకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో సమావేశమై కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఉల్లోజు శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులుగా అదిమూలం శ్రీనివాస్, ఎండీ అక్బర్, ప్రధాన కార్యదర్శిగా వేముల శంకర్, కోశాధికారిగా రుద్రగోని నర్సింగ్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా డి.సురేష్, శ్రీనివాస్ యాదవ్, కార్యనిర్వహక కార్యదర్శిగా మామిడాల మల్లేష్, సలహాదారులుగా వడ్లోజు జ్యోతిర్మయాచారి, కీసరి సహాదేవ్ చారి, కడియాల రమేష్, సీర శ్రీనివాస్, విజయ్, శ్రీనివాసరావు, కే.సత్యనారాయణ, కే సి మోహన్, బెలిదే అశోక్ లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల రాష్ట్ర నాయకులు మోతే వెంకటరెడ్డి, మెరుగు చంద్రమోహన్, ఇతర నాయకులు ఏ.భాస్కర్ రెడ్డి, గడ్డమీది బాలరాజు గౌడ్, లక్కిడి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు