
గాంధీ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ జర్నలిస్టుల ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ ఆఫీస్ ఆవరణలో చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి. అనంతరం కాప్రా మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులను ఉద్దేశించి ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని, అక్రెడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.