
భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన 262 మంది బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR) కి ఘన స్వాగతం పలికిన తాటికొండ గ్రామస్తులు.
ఎన్నికల ప్రచారానికి తాటికొండ గ్రామానికి విచ్చేసిన జిఎంఆర్ కు వెల్లువలా తరలివచ్చి, మద్దతు తెలిపి, ప్రచారంలో పాల్గొన్న గ్రామస్తులు.
తాటికొండ గ్రామానికి సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని, గ్రామ అభివృద్ధికి 30 లక్షల నిధులు ఇస్తానని మోసం చేసిన అల వెంకటేశ్వర్ రెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్తామన్న గ్రామస్తులు.
భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఎరవపా నర్సింహ, బిఆర్ఎస్ వార్డ్ మెంబర్స్ శేరి రవీందర్ రెడ్డి, బోయ మారుతి మరియు శ్రీధర్ గౌడ్, బొల్లు ఆంజనేయులు, ఎల్పటి వెంకటేష్, పాషా, టీకే రవి కుమార్, జల్లక్క మల్లయ్య, సుదర్శన్, మొగుల్లయ్య, భగవంత్, నిరంజన్, నారాయణ, నర్సింహులు, బీసీ సెల్ నాయకులు సాయి కృష్ణ, ప్రతాప్ రెడ్డి, ఖాదర్ గార్ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన 262 మంది బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన జిఎంఆర్ కి భారీగా తరలివచ్చి, బాణాసంచా, డప్పు మేళాలతో అపూర్వ స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విస్తృతంగా పర్యటించి, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు వివరించిన దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR).
అనంతరం జిఎంఆర్ మాట్లాడుతూ దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి పట్టని ఆల వెంకటేశ్వర్ రెడ్డి ని 30 వేల ఓట్ల తేడాతో ఓడించి, దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసిన జియంఆర్