మల్కాజిగిరి బీఆర్ఎస్ లో బగ్గుమంటున్న విబేదాలు. ఆపార్టీ సీనియర్ నాయకుడు వేణునాయుడుపై సొంత పార్టీ నాయకులే దాడి చేయడం నియోజకవర్గంలో చర్చనీయంగా మారింది. ఎన్నికల చివరి దశలో పార్టీలో రగులుతున్న రగడ కాంగ్రెస్ పార్టీకీ అనుకూలంగా మారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జీ ఆర్ జితేందర్ రెడ్డి తీరు పార్టీ నాయకులకు తలనొప్పిగా మారిందనే ఆరొపనలున్నాయి. ఇందుకు గౌతంనగర్ డివిజన్ కు చెందిన సీనియర్ నాయకులు వేణునాయుడుపై జరిగిన దాడే నిలువెత్తు నిదర్శనం. ఇదే ప్రాంతానికి చెందిన బోనగిరి పాండు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ విషయమై చర్చించేందుకు ఇంచార్జీగా వ్యవహరిస్తోన్న జితేందర్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు వేణునాయుడితో కలసి మాట్లాడారు. ఎవరీ ప్రమేయంతో పార్టీ వీడుతున్నారనే విషయంలో జితేందర్ రెడ్డి వేణునాయుడిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చేయి చేసుకుని హాంగామా చేశారు. దీంతో వేణునాయకుడు అనుచరులు ప్రతిఘటించడంతో వాగ్వివాదం చొటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వేణునాయుడు తీవ్ర మనస్థాపానికి గురైబీ ఆర్ ఎస్ పార్టీ గుడ్ బై చెప్పి,స్థానిక కాలనీవాసులతో సమావేశమై పార్టీవీడేందుకు సిద్ధమైయ్యాడు. నేడోరేపో కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో కలిసి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు జితేందర్ రెడ్డి వ్యవహరించిన తీరే ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో గౌతంనగర్ డివిజన్ లకు చెందిన దయానంద్ నగర్, ఉత్తమ్ నగర్, ఎకలవ్వనగర్ కాలనీలు వేణునాయుడికే మద్దతు తెలుపుతున్నాయి. ఇంచార్జీగా వ్యవహరిస్తున్న జితేందర్ రెడ్డి తీరు పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని స్థానికులు ఆరొపిస్తున్నారు. ఈ విషయమై పార్టీ అదిష్టానం ఎమేరకు స్పందిస్తోందో వేచిచూడాల్సిందే