సిఎం కేసీఆర్ గారంటేనే నమ్మకానికి మారుపేరు
మానవీయ కోణంలో ప్రజల కోసం ఆలోచన చేసే మహనేత సిఎం కేసీఆర్
ఎన్నకచ్చినప్పుడు వచ్చే నాయకున్ని కాదు నెను మీ సేవకున్ని
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
తెలంగాణ రాష్ట్రం ఎర్పాటు అయ్యాకానే సిఎం కేసీఆర్ నాయకత్వం లో ప్రతి ఇంటికి సంక్షేమ పధకం అందుతుంది… ప్రతి ముఖంలో అనందం నిండుకుంది.తెలంగాణను నిలిపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దని మంచిర్యాల శాసనసభ్యులు బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. బుధవారం హాజీపూర్ మండలం లోని కొండాపూర్ గ్రామం,పెద్దంపేట గ్రామం,బుద్దిపల్లీ గ్రామం,గొల్లపల్లి గ్రామం లో ఇంటి ఇంటికి తిరుగుతూ
ఈ సందర్భంగా ఆయన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ… పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా బీ.ఆర్.ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ఉందని సిఎం కేసీఆర్ గారంటేనే నమ్మకానికి మారుపేరన్నారు. మానవీయ కోణంలో ప్రజల కోసం ఆలోచన చేసే మహనేత సిఎం కేసీఆర్ అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా, ఎవరిని కదిలించినా బిఆర్ఎస్ మేనిఫెస్టోపట్ల సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. బీ.ఆర్.ఎస్ మ్యానిఫెస్టోలో మహిళ సంక్షేమానికి పెద్దపీట వెసారని ‘సౌభాగ్య లక్ష్మి, కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్’ వంటి పథకాలు సిఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో 200 ఉన్న పెన్షన్ ను రెండు వేల రూపాయలకు పెంచింది సిఎం కేసీఆర్ అని బీ.ఆర్.ఎస్ పార్టీ మ్యానిపెస్టోలో 5 వేల వరకు ఆసరా ఫించన్ అందిస్తామని కేసీఆర్ ప్రకటించాన్నారు. రైతులు, దివ్యాంగులు రైతుబంధు, దివ్యాంగుల పెన్షన్ పెంపు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, ప్రతి ఇంటికి, ప్రతి వర్గానికి సంక్షేమ పథకం అందే విధంగా కేసీఆర్ మేనిఫెస్టోను రూపొందించారన్నారు. ఒక సాధారణ తెలంగాణ ఉద్యమకారుడినైన తనను ఆదరించి, ఆశీస్సులు అందించారని, టికెట్ ఇచ్చి నిలబెట్టారని కృతజ్ఞతలు తెలిపారు. కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతున్న తాను చేసిన అభివృద్ధిని గమనించి, మరింత అభివృద్ధి చేయడానికి తనకు మరోఅవకాశం ఇవ్వాలని, రాష్ట్రంలో సంక్షేమ పథకాల కొనసాగింపుకై మరోమారు బిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.. ఎన్నికలచ్చినప్పుడు మాత్రమే వచ్చే నాయకులం కాదని తాము మీ సేవకులం అన్నారు. ఈ ప్రాంతానికి ఏమీ చేయనోల్లు…ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చేటోల్లు దొంగ మాటాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ గుండాల మాటాలు ప్రజలు నమ్మవద్దన్నారు. బీ.ఆర్.ఎస్ పార్టీని తమను విమర్శించే నైతిక హక్కు ఈ హైదరాబాదు గుండా రౌడికి లేదన్నారు. హైదరాబాదు లో ఉండేది … ఎన్నికప్పుడు వచ్చేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ సాగర్ రావు అని… మంచిర్యాల నియోజకవర్గం లో ప్రజల కోసం నా జీవితాన్ని అకింతం చేసి నిత్యం సేవ చేస్తుంది తానని అన్నారు. ఈ హైదరాబాధీకీ ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్దిని చెప్పాలన్నారు. సకల వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సిఎం కేసీఆర్ బుణం తీర్చుకోవాలని నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని అన్నారు….