Tuesday, April 15, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

బిఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టింది: నాయిని

బిఆర్ఎస్ పార్టీ కేవలం మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు…రామన్నపేట లో మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో నాయిని..

బిఆర్ఎస్ పార్టీ అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టింది. బిఆర్ఎస్ ప్రభుత్వం మాటలకు తప్ప చేతలకు పనికి రాదు.

అభివృద్ధిలో కాని కరంటు విషయంలో కాని సంక్షేమ పథకాల విషయంలో కాని వరద ముంపుకు గురై ఆర్ధికంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడంలో కాని పూర్తిగా విఫలమయింది,

పత్రికా ప్రకటనలు, శంకు స్థాపనలకు తప్ప మరేవాటికి పనికి రారు.

బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణా సంపదనంత దోచుకోతిన్నారు.

బిజేపి బిఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు ఒక్కటే,. బిఆర్ఎస్ బిజెపి రెండు పార్టీలు ఒక్కటి కాకపోతే మరి ఇంతవరకు లిక్కర్ స్కాంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు?

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కాజిపేట బస్టాండ్ ఇవ్వడం లేదు అంటూ ధర్నాలు చేసారు మరి మీరు అధికారంలోకి వచ్చి 9 నర ఏండ్లు దాటింది మరి మీరు ఏం చేసారు అని అడుగుతున్న్జ్నా ?

విభజన చట్టంలో పొందుపరచిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందింది ఈ ప్రభుత్వాలు
ఈ నెల 21 నుండి వరంగల్ పశ్చిమలో రామన్నపేట 29 వ డివిజన్ నుండి పాదయాత్ర మొదలవుతుంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ పాదయాత్రలో ప్రజలు వివరించుతాం.

మరియు సోనియా గాంధీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటి స్కీం పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం. ప్రజలను చైతన్యపరుస్తాం ఆని అన్నారు.

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి చెందుతుంది. బడుగు బలహీన వర్గాలకుచ లాభం చేకూరుతుందని అన్నారుయ్.

ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు ఓరుగంటి పూర్ణ, మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, నాయిని లక్ష్మా రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులూ చెన్నమల్లు, బంక సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!