
తాజాగా చౌటబెట్ల గ్రామానికి చెందిన 29 కుటుంబాలు BRS పార్టీకి రాజీనామా చేసి వంగ రాజశేఖర్ గౌడ్ అధ్వర్యంలో మాజీ మంత్రి జూపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక.
కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డ్ చౌటబెట్ల గ్రామానికి చెందిన అధికార పార్టీలో ఉన్న 29 కీలకమైన కుటుంబాలు BRS పార్టీకీ రాజీనామా చేసి యువ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్ అధ్వర్యంలో కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు సమక్షంలో వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి భూ కబ్జాల చేస్తూ,అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారికి అండగా ఉంటూ ఎమ్మెల్యే కూడా తమ వాటా కమిషన్ ల కోసం అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని, అందుకే కొల్లాపూర్ ప్రజల సంక్షేమం కొరకు జూపల్లి నాయకత్వం ఉండాలని భావించి ముకుమ్మడిగా BRS పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలియజేశారు