Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

ఉప్పల్ గడ్డపై  బి ఆర్ ఎస్ జెండా ఎగరడం ఖాయం

ఉప్పల్ ఎన్నికల ఇన్చార్జ్  రావుల శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ధీమా

బి ఆర్ ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కూ తోడు నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డి చేపట్టిన సేవా కార్యక్రమాలు,  ప్రజల ఆశీర్వాదంతో  అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో  టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని  నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్  రావుల శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఈసీఎల్ లోని పరివార్ హోటల్లో  ఉప్పల్ నియోజకవర్గ  కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో  ఉప్పల్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్

, తెలంగాణ రాష్ట్ర  విద్య, సంక్షేమ సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 బిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో  పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం  అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టినట్టు తెలిపారు.

 పేదలు అన్ని వర్గాల సంక్షేమం కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,  రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా  వంటి పథకాలు  ప్రవేశపెట్టిన ఘనత  సీఎం కేసీఆర్ కు దక్కుతుంద న్నారు. గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో  చేయని అభివృద్ధి.. గత తొమ్మిది సంవత్సరాల్లో రెట్టింపు అభివృద్ధి జరిగింద న్నారు. సీఎం కేసీఆర్ దూర దృష్టితో.. భావితరాలకు బంగారు బాట వేసే దిశగా ప్రయత్నం చేస్తుందన్నారు.

 రానున్న  ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని, అలాగే ఉప్పల్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో లక్ష్మారెడ్డి గెలుపు దిశగా కృషి చేయాలని పిలుపుని చ్చారు.  ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి, కడప గడపకు తీసుకెళ్లి  కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రచారం చేయాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే.. కుటుంబానికి పెద్ద దిక్కుగా అందరికీ అందుబాటులో ఉండి కష్టనష్టాల్లో తోడుంటానని  భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంబీసీ మాజీ చైర్మన్  తాడూరు శ్రీనివాస్, నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ బాధ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!