
15 సంవత్సరాలుగా,మూడు పర్యాయాలు మధిర అసెంబ్లీ నుండి ఇద్దరికీ అనగా భట్టి విక్రమార్కకి, లింగాల కమల్ రాజు కి ఓట్లు వేసారు.కానీ మధిర నియోజకవర్గంలో విద్య, వైద్యం,ఉపాధి రంగాల్లో జరిగినది, ఒరిగిన అభివృద్ధి శూన్యం.ఉద్యమ కారుడినై,త్యాగాలు చేసిన నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మధిర ఎమ్మెల్యేగా గెలిపించండి. మీ బిడ్డగా కులాలకు,మతాలకు,పార్టీలకు అతీతంగా మీకు పాలేరుగా పనిచేస్తా,అవినీతిలేని అభివృద్దిని ఉరకలు పెట్టిస్తాను..అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచుతాను.అంటూ..
ఈ రోజు మధిర పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ రెబల్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మెర రామమూర్తి మధిర వాకర్స్ మిత్రులను, పెద్దలను, స్విమ్మింగ్ అసోసియేషన్ పెద్దలను కలిసి మధిర రెబల్ గా పోటీ చేస్తున్న నాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమకారుడికి తీవ్ర అన్యాయం జరిగందని మీరు నమ్ముకున్న మీ కేసీఆర్ మీకు అన్యాయం చేసారనీ.మీకు కచ్చితంగా అండగా నిలబడతామని,ఒక ఉద్యమకారుడుని ఈ ఎన్నికల్లో గెలిపించుకుంటామని వారు ఇచ్చిన హామీ,చెప్పిన మాటలకు,నాకు కన్నీళ్ళు తెప్పించాయి.నేను చేసిన పోరాటాన్ని ఒక్కటొక్కటి గుర్తుచేస్తూ భుజం తడుతూ…నాకు గొప్ప శక్తిని,గెలుపు పై బరోసాను కలుగజేసారు.నేను కలిసిన ప్రతిఒక్కరు కూడా ప్రేమతో ఆశీర్వాదం ఇచ్చి అండగా ఉంటామని తెలిపారు.మధిరలో బొమ్మెర రామమూర్తి ఆత్మగౌరవ పోరాట పటిమ ఉన్నదని వారి విశ్వాసాన్ని తెలియజేస్తున్నారు..ఈ సందర్భంగా 4వ తాదీన నామినేషన్ వేస్తున్నానని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీ ప్రకాష్ మిత్రుడు అరవింద్, వివిధ హోదాలో ఉన్న పెద్దలు, మిత్రులు పాల్గొనడం జరిగింది.