బిఆర్ఎస్ రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు, కురుమూర్తి దేవస్థాన పాలకమండలి సభ్యులు గోపాలకృష్ణ స్వామి తదితర ముఖ్య నాయకులు.
దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండల మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు గోపాలకృష్ణ స్వామి, మాజీ వార్డ్ మెంబర్ శ్రీనివాస్ యాదవ్, సాయి మిత్ర, గొల్ల గోపాల్, పాపన్న, వడ్డే కురుమన్న, టీడీపీ పార్టీ నుండి సీనియర్ నాయకులు రామిరెడ్డి మరియు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR) , మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన సీతమ్మ, జిఎంఆర్. ఈ సందర్భంగా మండల కేంద్రానికి విచ్చేసిన నాయకులకు భారీ ర్యాలీతో, డప్పు వాయిద్యాలు, గజమాల వేసి ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు. అనంతరం మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు వివరించి, గ్యారెంటీ కార్డులను ప్రజలకు అందజేసి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరిన జియంఆర్
ఈ కార్యక్రమంలో మదనపురం మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.