కాప్రా డివిజన్ లోని శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఏ. భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా జి. సుభాష్ రెడ్డి, కోశాధికారిగా ఏబి. శంకరరావు, ఉపాధ్యక్షులుగా టీ. ప్రభాకర్ రెడ్డి ,జి .కృష్ణారెడ్డి, జి .వెంకట కృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శులుగా కే. మురళీధర్ రావు, ఎం. సుబ్బారావు, కమిటీ సభ్యులుగా భాస్కర నాయుడు, బి. సంతోష్, ఎన్. కొండల్ రెడ్డి, చిత్తరంజన్ భట్టాచార్య, టి. ఇంద్రారెడ్డి, పి. సురేష్, కె. బాలు మహేంద్ర ఎన్నికయ్యారు. అసోసియేషన్ సలహాదారులుగా వి. కృష్ణన్, జి. ఆర్. ఠాగూర్, ఎం. చంద్రమౌళీశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో నెలకొని ఉన్న సమస్యలు, ఇతర అభివృద్ధి పనులను సంబంధిత అధికారులకు, స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రెండు సార్లు కార్యదర్శిగా, మరో మారు అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కాలనీ ప్రజలకు, అసోసియేషన్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.