గోల్డ్ మెడల్ సాధించడంతో బంగారు కృష్ణగా మారిన బంటు కృష్ణ
డాక్టర్ బంటు కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడంతో తెలంగాణలో మారుమోగుతున్న భానుపురి పేరు
ప్రముఖ, కవి, రచయిత, గాయకుడు, విద్యావేత్త, శ్రీ వశిష్ట విద్యాసంస్థల డీన్ కొంపల్లి దశరథ
డాక్టర్ బంటు కృష్ణను ఘనంగా సన్మానించిన ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, చిన్ననాటి మిత్రులు, శ్రీరామ్ నగర్ కాలనీవాసులు, మీడియా స్నేహితులు
జర్నలిజం లో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా తో పాటు గోల్డ్ మెడల్ సాధించిన బంటు కృష్ణ భానుపురి ఆణిముత్యం అని, గోల్డ్ మెడల్ సాధించి బంటు కృష్ణ బంగారు కృష్ణగా మారాడని ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, విద్యావేత్త, శ్రీవశిష్ట విద్యా సంస్థల డీన్ కొంపల్లి దశరథ ప్రశంసించారు. ఆదివారం గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ బంటు కృష్ణ స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి, స్వీట్లు పంచి ఘనంగా సన్మానించిన సందర్భంగా దశరథ మాట్లాడారు. వృత్తిని ప్రవృత్తిగా మార్చి కవిగా, రచయితగా, జర్నలిస్టుగా కొనసాగుతూనే నిరంతరం శ్రమించి, గోల్డ్ మెడల్ సాధించి భానుపురి పేరు, ప్రతిష్టలను తెలంగాణ వ్యాప్తంగా మారుమోగిస్తున్నాడని, భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని, వ్యవసాయమనే ఈ విద్యా వ్యవసాయం కొనసాగుతూనే ఉండాలని, భానుపురి మొత్తానికి బంగారు పథకాన్ని కానుకగా తెచ్చిన విజ్ఞాని డాక్టర్ బంటు కృష్ణను తాను ఒక్కడినే కాకుండా సూర్యాపేట జిల్లా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఇంకా సీనియర్ జర్నలిస్ట్ బచ్చు పురుషోత్తం, శ్రీ వశిష్ట విద్యాసంస్థల పి ఆర్ ఓ జానకి రాములు, శేఖర్ తదితరులు ఈ సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు.
మనమ్ వికాస వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ కృష్ణ ను సన్మానించిన ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ
ప్రపంచ కవిత కవితా దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట మనమ్ వికాస వేదిక అధ్యక్షులు, ప్రముఖ కవి, సాహితీ పిపాసి పెద్దిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సుద్దాల అశోక్ తేజ తో సాయంత్రం’ కార్యక్రమంలో భాగంగా జర్నలిజం లో పిహెచ్డి పూర్తి చేసి, డాక్టరేట్ సాధించి, గోల్డ్ మెడల్ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై చేతుల మీదుగా అందుకున్న సూర్యాపేటకు చెందిన కవి, రచయిత, జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ ను సినీ గేయ రచయిత, కేంద్ర ప్రభుత్వ ఉత్తమ గేయ రచయిత అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ, కవులు, కళాకారులు, మనమ్ వికాస వేదిక సభ్యులు, సాహితీ ప్రియుల మధ్యన ఘనంగా సన్మానించారు. అనంతరం కౌన్సిలర్ గండూరి కృపాకర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, విమర్శకులు ప్రసేన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాకర్ పివిసి ఎండి మీలా మహదేవ్, ప్రముఖ రైస్ మిల్లర్ కక్కిరేణి చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ప్రముఖ రియల్టర్ బొలిశెట్టి మధు, గండూరి శంకర్, అపర ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు, హోప్ స్వచ్ఛంద సేవాసమితి అధ్యక్షులు ధైద వెంకన్న, భోనగిరి భాస్కర్,యమా ప్రభాకర్, గుండా రమేష్, మనోహర్, నీల శ్రీనివాస్, రాచకొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బంటు కృష్ణను సన్మానించిన మీడియా మిత్రులు, చిన్ననాటి స్నేహితులు, శ్రీరాంనగర్ కాలనీ వాసులు
ఇంకా మీడియా మిత్రులు, సీనియర్ విలేకరులు నాయిని శ్రీనివాసరావు, పాల్వాయి జానయ్య, ఉయ్యాల నరసయ్య, దుర్గం బాలు, శ్రీనివాస్ నాయక్ తదితరులు స్వీట్ తినిపించి బంటు కృష్ణను సన్మానించారు. అనంతరం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన టెలిఫోన్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగులు వనమా సుభాష్ దంపతులు, ప్రసాద్, ఆర్టిసి ఉద్యోగి రేసు శ్రీనివాస్ గౌడ్ లు ఘనంగా సన్మానించారు. తదుపరి చిన్ననాటి మిత్రులు, క్లాస్మేట్స్, ప్రముఖ వ్యాపారి అనంతుల రాజేశ్వర్, శ్యాం ప్రసాద్ రెడ్డి, విజయ్ తదితరులు సన్మానించారు. తనలోని ప్రతిభను, బంగారు పథకాన్ని సాధించిన ఘనతను గుర్తించి, సన్మానించి, గౌరవించిన అందరికీ బంటు కృష్ణ ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు