BRS ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి ప్రజలనుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గం వాసవి మిత్రమoడలి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వారు బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి దసరా శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.
ప్రజాసేవే లక్ష్యంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గంలో ఎవ్వరికి ఏ అపదవచ్చినా కొండంత అండగా ఉంటూ ఆదుకుంటున్న ఆపద్భాందవుడు బండారి లక్ష్మారెడ్డి వెంటే తాముంటామని, ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే అది బిఅర్ఎస్ పార్టీతోనే సాధ్యం అంటూ, కారు గుర్తుకు ఓటు వేసి అత్యంత భారీ మెజారిటీతో గెలిపిస్తామని తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెద్ది నాగరాజు గుప్త, ప్రధానకార్యదర్శి రెబెల్లి శ్రీనివాస్ గుప్త, కార్యనిర్వాహక కార్యదర్శి గంప కృష్ణ గుప్త, బాచెల్లి నవీన్ గుప్త, నంగునూరి అశోక్ గుప్త, బెలిదే భగవాన్ గుప్త, ఏచురి నాగేశ్వరరావు గుప్త, చందా సంతోష్ గుప్త తదితరులు పాల్గొన్నారు