
ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ కాపు సంఘ భవనంలో, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కాపు కులాల ఐక్యవేదిక సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గంలో 40వేల ఓటర్లు ఉన్నటువంటి కాపులు, తమ సామాజిక వర్గానికి ఒక ఫంక్షన్ హాలు ఏర్పాటు చెయ్యాలని, రాజకీయంగా తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ, వంగవీటి మోహనరంగా రావు స్ఫూర్తితో బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
తనకు సంపూర్ణ మద్దతిచ్చిన కాపులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, కెసిఆర్ గారు కాపుల కమ్యూనిటీ హాల్ కోసం హైటెక్ సిటీలో 7ఎకరాల స్థలాన్ని కేటాయించారని గుర్తుచేశారు. కాపులకు రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుందని హామీనిచ్చారు. తనకు టికెట్ రాగానే ఉప్పల్ నియోజకవర్గ అభివద్ధి కొరకు సీఎం కేసీఆర్ తో మాట్లాడి 40 కోట్ల నిధులు మంజూరు చేపించానని, ఉప్పల్ నియోజకవర్గానికి 100పడకల ఆసుపత్రి తీసుకొచ్చానన్నారు. తన దృష్టికి తీసుకొచ్చిన ఫంక్షన్ హల్ కోసం తప్పకుండా కృషి చేస్తానంటూ, ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు
ఈ సందర్భంగా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమంలో, కొట్లాడి సాధించిన తెలంగాణలో నీళ్లు, నిధులు నెరవేరాయంటూ, కెసిఆర్ గారిని మూడవసారి ముఖ్యమంత్రిని చేస్తే, పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతారన్నారు. బండారి లక్ష్మారెడ్డి సౌమ్యుడంటూ, తన బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఉచితంగా విద్య అందిస్తూనే, ఎంతోమందికి ఆపదలో ఆదుకున్నారన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో కాపులందరికీ అన్నివేళలా అండగా ఉండే బండారి లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పి.పావని రెడ్డి, గొల్లూరి అంజయ్య, కాపు కుల సంఘాల పెద్దలు పరియు ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాసరావు, జనరల్ సెక్రెటరీ ప్రసాద్, వి.నాగు, శ్రీనివాస్, ఏ.వి.ఆర్ దత్తు, శంకర్ బాబు, నాగన్న మధుసూదన్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు