ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల బోనాలకు సంబంధించిన నిధుల కేటాయింపు కోసం నిర్వహణ కమిటీలు హబ్సి గూడ లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో అప్లికేషన్ పత్రాలు EO కి అందజేయాలి అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గత సంవత్సరం దరఖాస్తు చేసుకున్న వారు కూడా మరల దరఖాస్తు చేసుకోవాలి అని ఆయన తెలిపారు. ఆశాడ బోనాల ఉత్సవాల కు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు త్వరలోనే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.