AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్
సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియా లో గత 15 సంవత్సరాల నుంచి విద్యా వాలంటరీగా(VV) పనిచేస్తున్న వారికి గౌరవ వేతనం రూ.26,000/- చెల్లించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. గురువారం రోజున బెల్లంపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ రెడ్డి మల్ల తిరుపతి గారికి AITUC ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియాలో ఓపెన్ కాస్ట్ లో సర్వం భూములు కోల్పోయిన PDF బాధితులు.ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకోలేక అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని,ఓపెన్ కాస్ట్లకు భూములు ఇచ్చి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తూ బెల్లంపల్లి ఏరియాను అభివృద్ధి చెందడంలో వీరి పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు,గత 15 సంవత్సరాల నుంచి బెల్లంపల్లి ఏరియాలో ఆర్ &ఆర్ సెంటర్లలో సేవసమితి ద్వారా విద్యా వాలంటీర్ గా(VV) పనిచేస్తున్నారని,వీరికి కేవలం 5000/- గౌరవ వేతనం ఇస్తున్నారని, దీనివలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.గౌరవ వేతనం పెంచాలని సింగరేణి యాజమాన్యానికి గతంలో అనేకసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని అన్నారు,ఇప్పటికైనా వీరికి గౌరవ వేతనం రూ.26వేల లేనిపక్షంలో వీరు రోడ్డుమీద పడే అవకాశం ఉందని అన్నారు,వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,ఈపీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విద్యా వాలంటీర్లు దుర్గం రమేష్,స్వప్న,సింధుజ తో పాటు తదితరులు పాల్గొన్నా