కాప్రా సర్కిల్ పరిధిలోని కమలా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులు దర్శనం ఇచ్చారు.అనంతరం మండపంలో కుంకుమ అర్చన తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటి సభ్యులు బుడిగా జనార్ధన్ దంపతులు ప్రత్యేక పూజల్లోపాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి కన్వీనర్ ఏ వి ఆర్ దత్తు,సలహాదారు బొజ్జ రాఘవ రెడ్డి,
సి హెచ్ మనోహర్ రావు,ఎం ఎన్ చారి, హరినాథ్ గౌడ్, వెంకటరాజం, విఠలా చారి,నమ్ముల రమేష్ యాదవ్, సుహాసిని, మాల్క దేవి, అర్చన, వాణి,హేమలత,కాలనీ వాసులు,స్థానికులు, భక్తులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు