మానవులుగా మనకు ఎవరు ఏమి ఇచ్చినా సరే మళ్లీ కావాలంటాము.. కానీ కడుపునిండా అన్నం పెడితే మాత్రం ఏమి కావాలని అడగమని నిరూపిస్తున్నారు కుషాయిగూడ కు చెందిన శ్రీ “మారుతి మిత్ర మండలి” సభ్యులు. ప్రతి నెల కుషాయిగూడ పోచమ్మ దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించే అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం అమావాస్య ను పురస్కరించుకొని నిర్వహించారు. కార్యక్రమానికి కుషాయిగూడ కు చెందిన వ్యాపారవేత్త ములుగు భాస్కర్ రెడ్డి, శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ సంకూరి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి అతిధులుగా హాజరయ్యారు. పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్విరామంగా ప్రతి అమావాస్య రోజున కడుపునిండా పేదలకు అన్నం పెడుతున్న మారుతీ మిత్ర మండలి కమిటీ సభ్యులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు అశోక్ చారి, ప్రధాన కార్యదర్శి హనుమంతు, కోశాధికారి మచ్చ బాబు గౌడ్, సభ్యులు వేణుగోపాల్ చారి, సింగిరెడ్డి వెంకట్రెడ్డి, కాసుల సురేష్ గౌడ్, వెంకటేష్ చారి, శ్రీకాంత్ గౌడ్, అమరాచారి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.