అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అమావాస్య రోజు అన్నదానం చేయడం ఎంతో శ్రేష్టమైనదని వాసవి మిత్రమండలి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు పెద్ది నాగరాజ్ గుప్తా, కోశాధికారి రామిణి తిరుమలేష్ గుప్తా లు ఆన్నారు. అమావాస్య సందర్భంగా సోమవారం కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తాలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం తో పాటు మరెన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతినెల పేద వృద్ధురాలు మాలే వరమ్మకు అందజేసే రూ: 1,000 పింఛన్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ది శ్రీనివాస్ గుప్తా, అమర కృష్ణ గుప్తా, చందా సంతోష్ గుప్తా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.