మున్నూరు కాపు అపెక్స్ కమిటీ చైర్మన్, బిసి మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తో కలిసి వెళ్లి ప్రగతి భవన్లో బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఐటీ మరియు పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు కి వినతి పత్రం అందజేసిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల స్థితిగతులపై కేటీఆర్ కు దేవయ్య వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది మున్నూరు కాపు లం ఉన్నామని ,బలమైన సామాజిక వర్గంగా ఉండి 24 శాతం ఓటింగ్ కలిగి ఉన్నామని, రాష్ట్రంలో మున్నూరు కాపులు పేద మధ్యతరగతి కుటుంబాల వారమే అధికంగా ఉన్నామని. వ్యవసాయమే మాకు ప్రధాన జీవనాధారం అని తెలిపారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో మున్నూరు కాపుల పిల్లలు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో పురోగతి సాధించలేకపోతున్నారని తెలిపారు. మా బిడ్డల భవిష్యత్తు కోసం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది 5000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని, రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాలలో మున్నూరు కాపు విద్యార్థిని విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణాల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి, ఐదు కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని కేటీఆర్ కు తెలియజేశారు దశాబ్ద కాలంగా మా ఈ న్యాయమైన హక్కుల సాధన కోసం శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మా ఈ న్యాయమైన హక్కులు పరిష్కారం కోసం బి ఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చాలని విన్నవించారు .