
పెద్దవంగర మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ MLA,తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్ డా. N సుధాకర్ రావు తో కలిసి పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
BRS పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా…. అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం, పెద్దవంగర మండలకేంద్రంలో గ్రామాల వారీగా వేరు వేరుగా కార్యకర్తలతో సమావేశమయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… BRS పార్టీ కార్యకర్తలు మరోసారి BRS పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్త సమస్యలను తీర్చే బాధ్యత తనదేనన్నారు. కార్యకర్తల కుటుంబంలో సభ్యుడిగా అండగా ఉంటానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కలిసికట్టుగా కృషి చేయాలని కార్యకర్తలకు హితవు పలికారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలని మంత్రి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి విషయంలో ఎన్నికలు ముగిశాక చర్యలు తీసుకుంటామని తెలిపారు.