మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత ని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించిన సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ బోర్డు మెంబర్స్ ,నాయకులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మల్కాజ్గిరి పార్లమెంట్ బి అర్ ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి, హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితను, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు మెంబర్లు జక్కుల మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్, లోక నాధన్, శ్యామ్ కుమార్, అనిత ప్రభాకర్, టి ఎన్.శ్రీనివాస్ , ఆకుల రూప, కే.బి. శంకర్ రావు, డివిజన్ అధ్యక్షులు,సీనియర్ నాయకులు పెద్దల నరసింహ, పనస శ్రీకాంత్, శివ, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. .