
డబల్ బెడ్ రూమ్ కోసం ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులను పరామర్శించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు పన్నాల హరీష్
కుత్బుల్లాపూర్,ప్రగతినగర్ వాస్తవ్యులు డబుల్ బెడ్రూమ్ కొరకు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించి ధర్నా చేశారు…
ప్రగతి భవన్ వద్ద ఒంటిమీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహేందర్ కుటుంబ సభ్యులను బిజెపి నాయకులు కలిసి ధైర్యం చెప్పడం జరిగింది.
అనేక సార్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ డబుల్ బెడ్ రూమ్ సమస్యపై ఎమ్మెల్యేను కలిసిన ప్రయోజనం లేకపోయేసరికి సోమవారం రోజున ప్రతిభవన్ వద్ద తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యానికి పాల్పడిన మహేందర్.
జిల్లా బిజెపి అధ్యక్షులు హరీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ డబల్ బెడ్ రూములు మంజూరు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు ఆకుల సతీష్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నరేంద్ర చౌదరి, ట్రేడర్ సెల్ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.