Monday, April 28, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

కాప్రా లో కాంగ్రెస్ కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌ ప‌హ‌ల్గాం దాడి మృతుల‌కు నివాళి

కాశ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో టూరిస్టుల‌పై ఉగ్ర‌దాడిని ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్ర మూఖ‌ల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఉగ్ర‌దాడిని ఖండిస్తూ మృతులకు నివాళిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో కాప్రా లో భారీ ఎత్తున కోవతులా ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.

ప్ర‌శాంతంగా ఉన్న కాశ్మీర్ లోయ‌లో ఉగ్ర‌వాదులు దాడి చేయ‌డం హేయ‌మైన చ‌ర్య‌గా ఈ సంద‌ర్భంగా ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉగ్ర మూఖ‌లు చేసిన చీక‌టి దాడిలో అమాయ‌కులు మృతి చెందార‌న్నారు. మృతుల కుటుంబాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని కోరారు. దొంగ దెబ్బ తీసిన ఉగ్ర‌వాదుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్ల‌ను చేయాల‌ని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో డివిజన్ అధ్యక్షులు నాగ సాషు, టిల్లు యాదవ్,మాజీ కార్పొరేటర్ ధనపాల్ రెడ్డి, అంజిరెడ్డి,సీతారాంరెడ్డి, ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు ప్రసాద,మేడ్చల్ మల్కాజిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్, మేడ్చల్ మల్కాజిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూర్ణ యాదవ్,ఉప్పల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకారపు అరుణ్ క,మేడ్చల్ మల్కాజిగిరి ఎస్సీ సెల్ పత్తి కుమార్ ,యాదగిరి గౌడ్, అజీజ్, పెద్ది నాగరాజు, సంకు శ్రీకాంత్, లింగం,గోపాల్ యాదవ్, బాబురావు, మల్లారెడ్డి,రాకేష్ యాదవ్,సత్యనారాయణ,శ్రీహరి, నరేందర్ గౌడ్,వినోద్, శ్రీధర్ రెడ్డి, సాయి యాదవ్, నాగరాజ్ యాదవ్, సతీష్ యాదవ్,ప్రకాష్ రెడ్డి, అవినాష్,కొబ్బరి నాగరాజు ,మచ్చా శ్రీకాంత్ గౌడ్, సోమనాథ్, షాబుద్దీన్, సతీష్ యాదవ్ జ్యోతి, లక్ష్మి, సిద్ధిక్, ప్రదీప్, అలీ, మధు, మస్తాక్, ఆకలు సంతోష్,మనోజ్, యువజన కాంగ్రెస్ కాప్రా అధ్యక్షుడు ప్రశాంత్, అరుణ్, ఇమ్రాన్,హరి, కృష్ణ, కమలాకర్,పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!