జర్నలిస్టులు ఐక్యతతో మెలిగి తమ హక్కులు సాధించుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం శనివారం అణుపురం కమ్యూనిటీ హాలు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిదిగా హాజరైన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా ఉప్పల్, కాప్రాలో ప్రెస్ క్లబ్ లకు సొంత భవనాలకు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టియు డబ్లూజే- ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు కే.విరహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజ హితాన్ని కాంక్షిస్తూ సామాజిక స్పృహతో పనిచేస్తేనే ప్రజల విశ్వాసం, ఆదరాభిమానాలు పొందుతారని తెలిపారు.జర్నలిస్టుల విలువలను దిగజార్చే శక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలని సూచించారు..కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, జే.ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, టీయుదబ్లుజె రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నాయకులు మెరుగు చంద్ర మోహన్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జూరి పావనీ రెడ్డి, గుండరపు శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సాయి జెన్ శేఖర్, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, బోదాసు లక్ష్మి నారాయణ, ఎస్ ఎం రహీం,టీడీపీ నాయకులు నీరుకొండ సతీష్ బాబు టీయుడబ్లుజే మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డమీది బాలరాజు గౌడ్, డి.వెంకట్రామ్ రెడ్డి, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉల్లోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వేముల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.విజయ్ కుమార్, కోశాదికారి రుద్రగొని నర్సింగ్ గౌడ్, ఉపాధ్యక్షులు అక్బర్, నటరాజ్, జి.గోపాల్ గౌడ్, కార్యదర్శులు వి సురేష్, శ్రీనివాస్, బసంత్, ప్రశాంత్, కే వెంకటేష్, సీనియ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు