తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాదులోని తన క్వార్టర్స్ లో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాగబోయిన పాపారావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ఏజెన్సీ 5వ షెడ్యూల్ ప్రాంతం పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని, ఆదివాసి హక్కులు, చట్టాలను తెలంగాణ ప్రజా పాలనలో పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఐటీడీఏలను బలోపేతం చేసి ఏజెన్సీ ప్రాంతాలలో ప్రాథమిక విద్యను పటిష్టంగా అమలుకు కృషి చేయాలని పేర్కొన్నారు.అందుకు సానుకూలంగా స్పందించిన టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు