కుషాయిగూడ భజన్ మందిర్ వినాయక నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కుషాయిగూడ భజన మందిర్ లో ఏర్పాటు చేసిన 78 వ సంవత్సర వినాయక చవితి ఉత్సవలలో భాగంగా కొలువైన గణనాథుడిని గ్రామస్తులు శనివారం నిమజ్జనానికి కాప్రా చెరువుకు తరలించారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో అలంకరించి భారీ ప్రదర్శన నిర్వహించారు. అఘోర వేషధారణలో కళాకారుల నృత్యాలు, పూణే బ్యాండ్ , భాజా భజంత్రీలు బ్యాండ్ మేళాలతో కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ మీదుగా కాపురా చెరువుకు గణనాధుని తరలించారు. అనంతరం చెరువులో సంప్రదాయపద్ధంగా గణనాథుని నిమజ్జనం చేసి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ చైర్మన్ పాండాల శివకుమార్ గౌడ్ , కుషాయిగూడ గ్రామ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చక్రపాణి గౌడ్ , కమిటీ సభ్యులు పంజాల బాబు, యాదయ్య, వాసు, కిషోర్ , నర్సింగ్ , జి కృష్ణ, గణేష్ , కుషాయిగూడ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సంకూరి శ్రీనివాస్ గౌడ్ , పిట్టల రాజు ముదిరాజ్ , జనార్ధన్ , తదితరులు పాల్గొన్నారు.
వరుసగా మూడోసారి వేలం పాటలో రూ.1.50 లక్షలకు లడ్డును దక్కించుకున్న రామరాజు గౌడ్
గత ఏడు రోజులుగా పూజలు అందుకున్న కుషాయిగూడ భజన మందిర్ గణనాధుని లడ్డును వేలం పాటలో కుషాయిగూడ గ్రామస్తుడు, కుషాయిగూడ కళ్ళు గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు పనగట్ల రామరాజు గౌడ్ 1,50,000/- ( ఒక లక్ష యాభై వేల రూపాయలకు) వరుసగా మూడోసారి దక్కించుకున్నాడు. కుషాయిగూడ భజన్ మందిర్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ పండాల శివకుమార్ గౌడ్ వేలంలో లడ్డును దక్కించుకున్న పనగట్ల రామరాజు గౌడ్ కుటుంబ సభ్యులకు లడ్డును అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రామరాజు గౌడ్ మాట్లాడుతూ… కుషాయిగూడ భజన మందిర్ వినాయకుడి లడ్డును బహిరంగ వేలంలో వరుసగా మూడోసారి తానే దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆ వినాయకుడి అనుగ్రహంతో గ్రామానికి, పరిసర కాలనీల ప్రజలకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు