తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తా లో ని చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే విరాహత్ అలీ, రాష్ట్ర కోశాధికారి మోతె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సి కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, ప్రభుదాస్, బొంతు శ్రీదేవి ఐలమ్మ విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక.. మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి. భావితరాలకు ఆ మహనీయురాలి చరిత్ర తెలువాలని పాఠ్యాంశంగా పెట్టి గౌరవించాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు పావని మణిపాల్ రెడ్డి, కొత్త అంజిరెడ్డి, ప్రసాద్ , సీతారాం రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి నాగిళ్ల బాల్రెడ్డి, మహేందర్ రెడ్డి , చంద్రశేఖర్, రాజన్న, నీరు కొండ సతీష్ బాబు , మోహన్ రెడ్డి, శరత్, రజనీకాంత్ రెడ్డి, రహీం తెలంగాణ రజక సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శనిగరం అశోక్ రాష్ట్ర అధ్యక్షులు ముంజంపల్లి రాములు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు సోమయ్య రాష్ట్ర కార్యదర్శి సకినాల రవి. రాష్ట్ర కోశాధికారి జంజిరాల సత్యనారాయణ, యాకయ్య ,కొమురయ్య, కుమార్, రమేష్ , పగిండ్ల లింగయ్య, మల్లంపల్లి కుమార్, సాయి, సంపత్ , వెంకట్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు