చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ శుభోదయ కాలనీలోని శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలోని… పలు దేవుళ్లకు వెండి కిరిటాలు, తోరణాలను కుషాయిగూడ కల్లుగీత కార్మిక సహకార సంఘం అధ్యక్షుడు పనగట్ల రామరాజు గౌడ్ బహూకరించారు. శ్రీ కంట మహేశ్వర స్వామి బోనాల జాతరను పురస్కరించుకొని…. శనివారం ఆలయంలోని శ్రీ కంట మహేశ్వర స్వామి, రేణుక ఎల్లమ్మ, వన మైసమ్మ, శ్రీ సంజీవిని సహిత ఆంజనేయస్వామి విగ్రహాలకు అభిషేకాలు, పూజ కార్యక్రమాలు నిర్వహించి వెండి కిరీటాలను, తోరణాలను అలంకరించారు. ఇక కుషాయిగూడ నుంచి గౌడ కులస్తులు సామూహికంగా బోనాలను తీసుకొని ఆలయానికి ప్రదర్శనగా వచ్చి సంప్రదాయ పద్ధతిలో బోనాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. ఇక శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో బోనాల జాతర ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఈ మహోత్సవాలలో శ్రీ కంఠ మహేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.