చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రిపురం కాలనీకి చెందిన పెరపు నర్సింహం – దేవమని దంపతుల కుమారుడు ప్రశాంత్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో 3 వ సంవత్సరం చదువుతున్నాడు.
మెడిసిన్ చదువు చదివే స్థోమత లేక ఇబ్బంది పెడుతున్న విషయం తెలుసుకున్న BLR చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆర్ధిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడిసిన్ సీటు సాధించిన వారికి 5 సంవత్సరాలకు అయ్యే ఫీజు మొత్తం చెల్లిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు నేమూరి మహేష్ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి , విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు