డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం మార్కండేయ నగర్ పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎన్నికల ఇంచార్జీ జహంగీర్ పాషా, సోమ శేఖర్ రెడ్డి ,కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమ శేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు డివిజన్ అధ్యక్షులు కాసం మహిపాల్ రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా కోసం కష్టపడి ప్రతి గడప తిరుగుతూ మీరే ఒక అభ్యర్థిగా అనుకొని ప్రచారంలో పాల్గొని నా విజయానికి కృషి చేసిన మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదే విధంగా మన ఉప్పల్ నివాసి మన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీర్వాదంతో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి ని ఎంచుకోవడం జరిగింది. నా గెలుపుకు ఏ విధంగా అయితే కష్టపడి పని చేస్తారో అదే విధంగా మరి మన రాగిడి లక్ష్మారెడ్డి కోసం కూడా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల ఇంచార్జ్ జహంగీర్ పాషా మాట్లాడుతూ ప్రాంతేతరులు మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో బరిలో ఉన్నారని మన ప్రాంత వ్యక్తిని మనం గెలిపించుకోవాలని దానికి తగిన విధంగా కార్యాచరణ ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని ప్రతి ఒక్కరు గడపగడప సందర్శిస్తూ ప్రచారంలో పాల్గొనాలని అలాగే గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు మన గెలుపుకు సహాయపడతాయని అన్నారు. ఈ సందర్భంగా సోమ శేఖర్ రెడ్డి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీలను అమలుకు నోచుకోలేదని కాలయాపన చేస్తూ సమయం గడుపుతున్నారని, గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిపివేయబడ్డాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయం నుండి గత 20 ఏళ్లుగా ఎంతో పటిష్టమైన పార్టీ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుందని పార్టీ కోసం కష్టపడి పనిచేసి నిస్వార్ధంగా సేవలందించే గొప్ప నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉందని అన్నారు. నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుమార స్వామి , బేతాళ బాలరాజు , మనెమ్మ ,లక్ష్మి నారాయణ పటేల్, మురళి పంతులు, శిరీష రెడ్డి, రహీమ్ తదితరులు పాల్గొన్నారు.