జర్నలిజం లో పీహెచ్డీ పూర్తి చేసి, డాక్టరేట్ పట్టా పొంది, గోల్డ్ మెడల్ ను రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై చేతుల మీదుగా అందుకున్న సూర్యాపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ బంటు కృష్ణ ను శనివారం ఉదయం ఆయన స్వగృహానికి వెళ్లి సూర్యాపేటకు చెందిన అంగన్వాడి టీచర్లు సందినేని సృజన, మర్కాల విజయ, స్నేహితులు గుండపనేని రమేష్ తదితరులు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. విద్యారంగంలో, మీడియా రంగంలో సాధించిన ఈ ఘనతను గుర్తించి, ప్రశంసించి సన్మానించిన అంగన్వాడీ టీచర్లకు బంటు కృష్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు