ఉప్పల్ లోని వెంకటేశ్వర కాలనీ లో రూ.60లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఉప్పల్ పోచమ్మ దేవాలయం మార్గం లోని సీసీ రోడ్డు అధ్వన్నంగా మారింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం కార్పొరేటర్ రజితారమేశ్వర్రెడ్డి జీహెచ్ ఎంసీ నుంచి రూ.60 లక్షల నిధులను మంజూరు చేయించారు. బుధవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి కాలనీ వాసులతో కలిసి సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఈ.నిఖిల్ రెడ్డి ,కాలనీ అధ్యక్షులు సతీష్ గౌడ్ ,పండు ,జగన్ ,శ్రీధర్ ,విజయ్ భాస్కర్ ,కుమార్ స్వామి ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,పాలడుగు లక్ష్మణ్ ,రాఘవేందర్ ,సోమయ్య ,చందు ,మధుసూదన్ రెడ్డి ,పీరయ్య ,రాజు ,పద్మ ,జ్యోతి ,లావణ్య ,మంజుల ,అనిత తదితరులు పాల్గొన్నారు