తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ప్రజా పరిపాలన మొదలైందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ప్రజలు అభివృద్ధికి దూరంగా, స్వేచ్ఛ లేకుండా ఉన్నారని తెలిపారు. గత పాలకులు ప్రజా సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. కనీసం ప్రజలు తమ ఇబ్బందులను వివరించేందుకు, అర్జీలను పెట్టుకునేందుకు అవకాశం కూడా కల్పించలేదన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు.
ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం లో శనివారం పరమేశ్వర్ రెడ్డి హబ్సిగూడ డివిజన్ గణేష్ నగర్ కమ్యూనిటీ లో పాల్గొన్ని మాట్లాడారు
ఆరు గ్యారెంటీల పథకాలకు అర్హులైన వారు నేరుగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఒక్క దరఖాస్తుతో అన్ని రకాల పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. సూచించిన తేదీలలో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తు తీసుకునేందుకే ఈ అవకాశం కల్పించినట్టుగా చెప్పారు. అర్హులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆగి రెడ్డి గారు,ఆకారపు అరుణ్ ,చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి ,ధర్మేందర్ ,బాలయ్య బాబు ,వల్లపు శ్రీకాంత్ యాదవ్ ,రాజు ,వాసు ,కిషోర్ ,సైదులు ,సురేష్ ,సుదీర్ ,రాజు ,కనకయ్య ,యాదగిరి ,సంపత్ ,రఘు ,భాను