జై జవాన్ కాలనీలో వార్త రిపోర్టర్ చారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవానికి ముఖ్య అతిథిగా MLA బండారి లక్ష్మారెడ్డి అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామ్రుతాలతో అభిషేకం చేశారు.మహా పడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది.ఈ మహపడిపూజ మహోత్స వానికి పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మర ణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అయ్యప్ప స్వాములు, భక్తులు, కాలనీ వాసులు,తదితరులు పాల్గొన్నారు.