ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం ECIL చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన PRO స్పేస్ మొబైల్ షాప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో AS రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, BRS రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో PRO స్పేస్ మొబైల్ షాప్ యజమాని వీరేష్ మాట్లాడుతూ, “మా షాప్‌లో ప్రజలకు అన్ని రకాల మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో ఉంటాయి. మా షాప్‌లోని అన్ని ఉత్పత్తులకు ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది. మా షాప్‌కు ప్రజలందరూ రండి, మంచి ధరకే మంచి ఉత్పత్తులను పొందండి” అని అన్నారు.