
ఈనెల 23వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మల్కాజ్గిరి బృందావన్ గార్డెన్స్ లో ద్వితీయ వార్షిక ద్వాదశ ఆవృతి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను మల్కాజిగిరి సీఐ ప్రవీణ్ కుమార్ శనివారము కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ఆధ్యాత్మిక చింతన పెంపొందేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. విదేశాల్లో సైతం రోగులకు స్వాంతన చేకూరడానికి అక్కడి వైద్యులు విష్ణు సహస్రనామ పారాయణం లలితా సహస్రనామ పారాయణం వినిపిస్తున్నారని ఇదే మంచి ఫలితాలను సాధించిందని సైంటిఫిక్ గా రుజువు అయిందన్నారు. మన భావి తరాలకు కూడా ఈ నామాలు ఉచ్చరించడం నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గారామ్, ప్రభు గుప్త, సుధాకర్ గుప్తా ,ఉష తదితరులు పాల్గొన్నారు