
అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు, అలాంటిది ఎవ్వరు అడగకుండా, ఎక్కడా ధర్నాలు, రాస్తారోకోలు చెయ్యకుండానే, ఏ రాష్ట్రంలో లేని ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి, వాటిని విజయవంతంగా అమలు చేస్తూ, పేదప్రజలకు అండగా నిలిచిన కేసీఆర్ ని మూడవసారి ముఖ్యమంత్రిని చేస్తాం అంటూ, ఉప్పల్ నియోజకవర్గంలో బిఅర్ఎస్ పార్టీ గెలుపుకు మీర్ పేట్, శ్రీనివాసనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తమ సంపూర్ణ మద్దతు తెలుపారు.
ఈ సందర్భంగా మీర్ పేట్ లో ప్రచారం చేస్తున్న ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మేల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి ని శ్రీనివాస నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ ఆధ్వర్యంలో, మర్యాదపూర్వకంగా కలిసారు. తమ కాలనీ వాళ్లకు ఏ అవసరం వచ్చినా ఆదుకునే గొప్ప మనసున్న నాయకుడు, పేదలను BLR ట్రస్ట్ ద్వారా సహాయపడుతున్న బండారి లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి, ఉప్పల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తాం అంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.