
హబ్సిగుడ డివిజన్, కాకతీయ నగర్ నుండి ప్రారంభించి పి.ఎన్.టి కాలనీ, మీదుగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ జోరుగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డికి, బిఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్, బిఎల్అర్ ఫోటోల జెండాలతో మరోపక్క మహిళా సోదరీమణులు బొట్టు పెట్టి, మంగళ హరతులిస్తూ ఘనంగా స్వాగతం తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా బండారి లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాలనీ ప్రజలు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రెండు నెలల క్రితం ఇక్కడ నడవడానికి దారి కూడా సరిగ్గాలేని పరిస్థితి ఉండేదని, తానే స్వయంగా వచ్చి పరిశీలించి రోడ్డు మరమత్తులు చేయించానని తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కేసిఆర్ 40కోట్ల నిధులు మంజూరు చేశారని, ఎన్నికల తర్వాత వాటి పనులు మొదలవుతాయన్నారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ బిఅర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజార్టీతో గెలిపిస్తే, మీ ఎమ్మేల్యే గా సంబంధిత అధికారులను తీసుకొచ్చి దగ్గరుండి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.