
మతరాజకీయాలు మాకొద్దు..
అభివృద్ధి, సంక్షేమం వెంటే ఉంటామంటూ ప్రకటించిన బిజెపి జిల్లా పదాధికారి వెంకట్రామరెడ్డి.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక
కుల మతాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని, పేదలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్న బిఆర్ఎస్ వెంటే ఉంటామంటూ మహబూబ్ నగర్ జిల్లా బిజెపి పధాదికారి వెంకట్రామరెడ్డి తెలిపారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధిలో తన వెంట కలిసి వస్తున్న వెంకట్రామిరెడ్డికి స్వాగతం పలికారు.