
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దామగ్నపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బి ఆర్ ఎస్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ అభ్యర్థి ,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కి ప్రజలు ఘనస్వాగతం పలికారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అహర్నిశలు కష్టపడి పనిచేసి గెలుపునకు కృషి చేయాలని మన రాష్ట్ర అభివృద్ధి మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంతో మరిన్ని లక్ష్యాలను సాధించడానికి బంగారు తెలంగాణా నిర్మాణానికి కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, ప్రదీప్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.