
రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్ చౌహన్ ఐపిఎస్ వనస్థలి పురం మరియు హయత్ నగర్ పోలీసు స్టేషన్లను సందరర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ ఏర్పాట్ల మీద సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కమిషనర్ పేర్కొన్నారు. అవసరమైన చోట చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు అక్రమ నగదు తరలింపును అడ్డుకోవడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ తెలిపారు. కమిషనర్ వెంట ఎల్ బి నగర్ డిసిపి సాయి శ్రీ మరియు ఇతర అధికారులు ఉన్నారు.