ఈరోజు బిఆర్ఎస్ రాష్ట్ర నేత రాగిడి లక్ష్మారెడ్డి అధ్యక్షతన తన నివాసం హబ్సిగూడ గ్రీన్ హిల్స్ కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి విచ్చేయడం జరిగింది.
బూత్ స్థాయి క్లస్టర్ సమావేశాల్లో ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్, రామంతపూర్ డివిజన్, హబ్సిగూడ డివిజన్, చిల్కానగర్ డివిజన్, చెందిన బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ప్రధానకార్యదర్శిలు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రావుల శ్రీధర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి బూత్ స్థాయి క్లస్టర్ సమావేశంలో ఎన్నికల్లో నాయకులకు కార్యకర్తలకు బి ఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను కరపత్రాలు ద్వారా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని, ముఖ్యంగా బూత్ సాయి కార్యకర్తలు ప్రతి గడపగడపకి బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టోను సవివరంగా ఓటర్లకు వివరించాలని తద్వారా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని దిశ నిర్దేశం చేశారు.