Thursday, April 17, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

కాసానితో పాటు ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తాం: కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన టీటీడీపీ కి రాజీనామా చేసిన ఆ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ అధినేత

కాసానితో పాటు ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తాం

రాజేందర్ వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు పార్టీలోకి వచ్చారు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ శుక్రవారం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసానికి గులాబీ కండువా కప్పి కేసీఆర్ పార్టీ లోకి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ…

ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. కాసాని జ్ణానేశ్వర్ నాకు పాత మిత్రులు, ఎప్పుడో రావాల్సింది మీదగ్గరికి కాస్త లేటైందని” కాసాని అన్నారు. బండ ప్రకాష్ తో పాటు కాసాని కి సముచితం స్థానం కల్పించేవాడిని, ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు బీఆర్ఎస్ లోకి వచ్చినందుకు మనస్పూర్తిగా స్వాగతం తెలుపుతున్నాము. రానున్న రోజుల్లో ముదిరాజ్ సామాజికవర్గ నాయకులకు చాలా అవకాశాలు కల్పిస్తాము. రాజ్యసభ, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు ఇలా ఎన్నో పదవులు వరిస్తాయి.” అని సీఎం కేసీఆర్ అన్నారు.

ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రభుత్వ పరంగా ఎన్నో పథకాలను అమలు చేశామని, రాజకీయంగానూ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు కాసాని గారు, మిగతా నాయకులు, అతని అనుచరులంతా బీఆర్ఎస్ కుటుంబంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!