
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో మూకుమ్మడిగా 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక.
బాలానగర్ మండలం చింతకుంట తండాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తండాకు చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రవీందర్, వార్డు సభ్యులు రాజేశ్వరి, శ్రీనివాస్, రమేష్ సహా (100) మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. నూతనంగా చేరిన వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి మా పూర్తి మద్దతునిస్తూ కారు గుర్తుకు ఓటువేసి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.