
కల్వరాల గ్రామంలో చదువుకున్న యువకులు ఎవరు BRS కు ఓటు వేయవద్దు అంటూ మనవి.
వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో గ్రామానికి చెందిన యువకులు కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అమరవీరుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో BRS ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ లు వేయకుండా నిరుద్యోగులను అష్ట కష్టాలు పెడితే నిరుద్యోగులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.మళ్ళీ BRS ప్రభుత్వం వస్తె ఇక విద్యార్థులకు చావు తప్ప మరో మార్గం లేదు అనే ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరామని,దయచేసి కల్వరాల గ్రామంలో చదువుకున్న యువకులు ఎవరు BRS పార్టీకీ ఓటు వేయవద్దు అని కోరారు.
ఈ కార్యక్రమంలో వీపనగండ్ల మండల ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ మండల,గ్రామ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు