
బుధవారం కూకట్పల్లి NKNR గార్డెన్స్ లో జరిగిన కూకట్పల్లి డివిజన్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కూకట్పల్లి లో పుట్టి పెరిగిన నాకు ఇక్కడ స్థానిక ఇబ్బందులపై పూర్తి అవగాహన ఉంది అని….ఒకప్పుడు మంచి నీరు లేక మహిళలు ఎంతో ఇబ్బంది పడే వారని… దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్..బీజేపీ లు ఏ నాడూ నీటి కష్టాలు పట్టించుకోలేదు అని…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి నీరు ఇచ్చి అపర భగీరథుడు గా మారారు అని….కూకట్పల్లి నియోజకర్గంలో భవిష్యత్ లో నీటి కష్టాలు రాకుండా 9 రిజర్వ్ టాంక్ లు నిర్మించామని అన్నారు….ఎన్నో సంక్షేమ పథకాల తో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు వెళుతుంది అని…అలాగే నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ ద్వారా16 వేల మందికి ఒక్కొక్కరికి 1 లక్ష 116 రూపాయలు అందించామని తెలిపారు…ఇప్పటికే 60 వేల మందికి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేసామని… అర్హత కలిగిన లబ్ధి దారులందరికి తప్పకుండా డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు వస్తాయని అన్నారు…ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైద్రాబాద్ మహా నగరంలో అందరం అన్న తమ్ముల వలె…చక్కటి వాతవరణంలో జీవిస్తున్నాం అని అన్నారు….కాంగ్రెస్..బీజేపీ పార్టీలకు ప్రజల యోగ క్షేమాలు అవసరం లేదు అని…వారు పాలించే రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారా?అని ప్రశ్నించారు….అలాగే వారు పాలించే రాష్ట్రాల్లో ఎక్కడైనా 4 వేలు ఫించన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు….ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దశాబ్దాలు గా కాంగ్రెస్..బీజేపీ పార్టీలు చేయలేని ఎన్నో పనులు కేవలం 10 ఏళ్ళ లో చేసి చూపించమని అన్నారు….అందుకనే మళ్ళీ ముఖ్యమంత్రి గా కెసిఆర్ రావాలి అని…తెలంగాణ అభివృద్ధి BRS పార్టీ తో మాత్రమే సాధ్యమని అన్నారు…