
అధికార బిఆర్ఎస్ ను ప్రజలు నిలదీయాలి
హామీలు అమలు ఏమాయే అని ఎక్కడిక్కడ ఆడగండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఓగులాపూర్ గ్రామంలో గ్రామ శాఖ కార్యకర్తలతో కలిసి మండల కమిటీ అధ్యక్షులు ప్రవీణ్ మరియు నాయకులు ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో జిల్లా కమిటీ నాయకులు మండల కమిటీ నాయకులు యూత్ కమిటీ నాయకులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రతి ఒక్కరికి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుతూ ఈ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమాలను దోపిడీకి గురిచేస్తూ కార్యకర్తల కడుపునింపుకుంటూ ప్రజలను నిండా ముంచుతుంది, అమలుగాని సంక్షేమ పథకాలను డబుల్ బెడ్ రూమ్స్,దళితులకు భూమి, దళిత బంధు,బిసి బంధు,సబ్సీడీ రుణాలు ఎప్పుడు అమలు చేస్తారంటూ అధికార పార్టీ కార్యకర్తలను ప్రచార సమయంలో నిలదీయాలని పిలుపునివ్వడం జరిగింది. కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల ప్రాంతంలో దోపిడి రాజ్యమేలుతుంది” ప్రజలందరూ ఇట్టి విషయాన్ని గమనించి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కి అండగా ఉండి స్థానిక నేత అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.