ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ రాక్ టౌన్ కాలనీ వాసులకు భరోసా
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లోని రాక్ టౌన్ కాలనీలో మార్నింగ్ వాక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్, కాలనీవాసులకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను మిమ్మల్ని మోసపూరిత హామీలతో మభ్యపెట్టను. మీ కాలనీవాసులకు ఏం కావాలో నాకు చెప్పండి. అదే మేనిఫెస్టో పెడతాను. నాకు అబద్ధం మాట్లాడడం రాదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ సభ్యుడిగా వస్తున్నాను. అవకాశం ఇస్తే పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటాను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దరిపెల్లి రాజశేఖర్ రెడ్డి, లింగాల కిషోర్, కాలనీ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి సేటు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.