Monday, April 21, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది

నాలుగు సార్లు ఎం.ఎల్.ఎ. అయి ఉండి వినయ్ భాస్కర్ ప్రజలకు చేసింది ఏమి లేదు ? బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది…

ఎం.ఎల్.ఎ గా గెలిచిన వెంటనే మొట్ట మొదటగా అర్హులైన లబ్దిదారులకు, జర్నలిస్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం ..
దాల్వి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ మాజీ కార్పో రేటర్ తోట నవీన్..

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి తరపున నేడు కాజిపేట చౌరస్తా నుండి హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలి నిర్వహించారు. అశేష జన వాహినీతో ర్యాలి కొనసాగింది. పెద్ద ఎత్తునర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డికి మద్దతుగా ప్రజలు బైక్ ర్యాలిలో పాల్గొన్నారు.

ఈ బైక్ ర్యాలో వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి రవీంద్ర ఉత్తం రావు దాల్వి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు బి. శోభా రాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎం.పి సిరిసిల్ల రాజయ్యలు పాల్గొన్నారు.

అనంతరం హన్మకొండ జిల్లా కాంగ్రస్ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ ..

గత తొమ్మిదిన్నర సంవత్సరాలల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేసింది ఏమి లేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకపోయింది.

శాంక్షన్ అయిన నిధులు వినియోగించుకోలేనిర అసమర్ధ ఎం.ఎల్.లే & బిఆర్ఎస్
నాయకులు..

2018 నుంచి కొత్తగా రేషన్ కార్డులను, ఆసరా ఫించన్లను, బిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేయలేదు.

సంవత్సరానికి 100 చొప్పున 57 ఏళ్ళు దాటినా వారికీ కొత్త పెన్షన్లు ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదు.

ఎస్,సి, బి.సి. మైనారిటీ వర్గాలకు కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు.

నిరుద్యోగులకు ప్రతి నెల రూ. 3016 నిరుద్యోగ భ్రుతి చేల్లిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామి ఇంతవరకు నెరవేర్చలేదు.బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదినర ఏండ్లు గడుస్తున్న ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము నిరుపేద ప్రజలందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకున్నాం.

బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని అందిన కాడికి దోచుకుంటుంది. రాష్ట్రంలో నియంత పాలనా నడుస్తోంది.

ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఆర్భాటాలు, అబద్దాలు మాయమాటలతో పరిపాలన కొనసాగిస్తున్నారు.

కాజిపేట బస్టాండ్, జూనియర్ కాలేజీ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంది

ఎన్నికల ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కాడు. తెలంగాణాలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం ఒక కేసిఆర్ కుటుంబానికి ఎం.ఎల్.ఎ. వినయ్ భాస్కర్ కుటుంబమే .

ఎల్లప్పుడూ ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలపై పోరాడిన వారి కష్టం ఏందో నాకు తెలుసు

కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ సుస్థిర పాలనను అందించేది కాంగ్రెస్ పార్టీ .
అందుకే ఈ సారి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, ఎం.పి ఆనంద్, టిపిసిసి ఒబిసి డిపార్టుమెంటు కో-ఆర్డి నేటర్ పులి రాజు , నేషనల్ ఎస్.సి డిపార్టుమెంటు కో-ఆర్డినేటర్ పులి అనిల్ కుమార్, INTUC జిల్లా అద్యక్షుడు కూర వెంకట్, మైనారిటీ సెల్ చైర్జ్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పి. రామకృష్ణ, జిల్లా ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం, జిల్లా AIUEWC జిల్లా అధ్యక్షురాలు గుంటి స్వప్న, జిల్లా NSUI అధ్యక్షుడు పల్లకొండ సతీష్, మాజీ కార్పొరేటర్లు నసీం జహాన్, బుద్ధ జగన్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బంక సంపత్ యాదవ్, అంబేద్కర్ రాజు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకుష్, ఎం.వి. రాజు, నాయిని లక్ష్మా రెడ్డి, ఇప్పా శ్రీకాంత్, బొంత సారంగం, డివిజన్ అద్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!